అవయవాల తరలింపు కోసం గ్రీన్‌ ఛానెల్స్‌

ABN , First Publish Date - 2022-07-18T13:11:06+05:30 IST

కామినేని ఆస్పత్రిలో ఓ వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలను నగరంలోని రెండు ఆస్పత్రులకు తరలించేందుకు హైదరాబాద్‌, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు

అవయవాల తరలింపు కోసం గ్రీన్‌ ఛానెల్స్‌

హైదరాబాద్‌ సిటీ: కామినేని ఆస్పత్రిలో ఓ వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలను నగరంలోని రెండు ఆస్పత్రులకు తరలించేందుకు హైదరాబాద్‌, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఆదివారం గ్రీన్‌ ఛానెల్స్‌ ఏర్పాటుచేశారు. గుండెను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి, ఊపిరితిత్తులను బేగంపేట కిమ్స్‌ ఆస్పత్రులకు తరలించారు. సాయంత్రం 5.19 గంటలకు కామినేని ఆస్పత్రి నుంచి గుండెను తీసుకొని బయలుదేరిన అంబులెన్స్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి 5.42 గంటలకు చేరుకుంది. 21 కిలోమీటర్ల దూరాన్ని 23 నిమిషాల్లో చేరుకుంది. ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి ఊపిరితిత్తులతో 5.46గంటలకు బయలుదేరిన అంబులెన్స్‌ బేగంపేట కిమ్స్‌ ఆస్పత్రికి 6.09గంటలకు చేరుకుంది. రెండు ఆస్పత్రుల మధ్య 18 కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్‌ 23 నిమిషాల్లో చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పుటివరకు 21 సార్లు గ్రీన్‌ ఛానెల్స్‌ ఏర్పాటుచేసి, అవయవాలను తరలించేందుకు సహకారమందించామని హైదరాబాద్‌ జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) రంగనాథ్‌ తెలిపారు. అవయవాల తరలింపునకు గ్రీన్‌చానెల్‌ ఏర్పాటుచేసి సహకరించిన ట్రాఫిక్‌ పోలీసులకు వైద్యులు, రోగుల కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Read more