హుజూర్‌నగర్‌కు జిల్లా అదనపు కోర్టు మంజూరు

ABN , First Publish Date - 2022-11-17T00:27:23+05:30 IST

హుజూర్‌నగర్‌లో జిల్లా అదనపు కోర్టు ఏర్పాటుకు ప్రభు త్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు చేస్తూ ప్రభుత్వ న్యాయ, శాసనసభ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు బుధవారం జీవో 559ను జారీ చేశా రు. కాగా హుజూర్‌నగర్‌లో ఇప్పటికే జూనియర్‌ సివిల్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు ఉండ గా ప్రస్తువం మంజూరైన జిల్లా అదనపు కోర్టు లో మొత్తం 3 కోర్టులు కానున్నాయి.

హుజూర్‌నగర్‌కు జిల్లా అదనపు కోర్టు మంజూరు

హర్షం వ్యక్తం చేసిన న్యాయవాదులు

హుజూర్‌నగర్‌ , నవంబరు 16 : హుజూర్‌నగర్‌లో జిల్లా అదనపు కోర్టు ఏర్పాటుకు ప్రభు త్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు చేస్తూ ప్రభుత్వ న్యాయ, శాసనసభ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు బుధవారం జీవో 559ను జారీ చేశా రు. కాగా హుజూర్‌నగర్‌లో ఇప్పటికే జూనియర్‌ సివిల్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు ఉండ గా ప్రస్తువం మంజూరైన జిల్లా అదనపు కోర్టు లో మొత్తం 3 కోర్టులు కానున్నాయి. జిల్లా అదన పు కోర్టు కోసం ఏడేళ్లుగా హుజూర్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి ఆధ్వర్యంలో అనేక ప్రయత్నాలు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నుంచి హైకోర్టు అత్యున్న త న్యాయమూర్తుల వరకూ అనేక దఫాలుగా సంప్రదించారు. కోర్టు ఏర్పాటు నిర్ణయం రెండేళ్లుగా సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హుజూర్‌నగర్‌ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఇదిలా ఉండగా జిల్లా అదనపు కోర్టు కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, న్యాయవాదులు ఆయా ప్రాం తాల్లో జిల్లా కోర్టు ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ మొదలైంది. దీంతో కొంతకాలయాపన జరిగింది. ఎట్టకేలకు హుజూర్‌నగర్‌ బా ర్‌ అసోసియేషన్‌ ప్రయత్నాలు ఫలితంగా జిల్లా కోర్టు మంజూరైం ది. కాగా జిల్లా కోర్టు మంజూరుతో పెండింగ్‌ కేసులకు సత్వర పరిష్కారం లభించనున్నది. కక్షిదారులకు దూరభారం తగ్గనుంది. అదనపు కోర్టు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డిలతో పాటు కోర్టు ఏర్పాటుకు కృషి చేసిన బార్‌ ప్రెసిడెంట్‌ సాముల రాంరెడ్డిలకు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ కృషితో కోర్టు మంజూరు : ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్‌ కృషితో హుజూర్‌నగర్‌ పట్టణానికి జిల్లా అదనపు కోర్టు మంజూరైందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని విలేకర్ల తో మాట్లాడుతూ సీఎం ఉపఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు. హుజూరనగర్‌ ప్రాంతంలోని కక్షిదారులకు అదనపు కోర్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. న్యాయవాదుల కు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, అమర్‌నాథ్‌రెడ్డి, కేఎల్‌ఎన్‌రెడ్డి, కొప్పుల సైదిరెడ్డి, కడియం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:27:29+05:30 IST