కరీంనగర్‌లో గ్రానైట్‌, ఇసుక, గుట్కా మాఫియా

ABN , First Publish Date - 2022-11-16T04:05:04+05:30 IST

కరీంనగర్‌ టౌన్‌, నవంబర్‌ 15: ‘ఇసుక మాఫియాలో కరీంనగర్‌ నంబర్‌ వన్‌.. ఇక్కడ గ్రానైట్‌ మాఫియా.. గుట్కా మాఫియా.. భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పెద్ద దొరకు, చిన్నదొరకు ఇవ్వాల్సిన కమీషన్లు అందుతున్నాయి.

కరీంనగర్‌లో గ్రానైట్‌, ఇసుక, గుట్కా మాఫియా

పెద్ద దొర, చిన్న దొరకు అవినీతిలో వాటా: షర్మిల

కరీంనగర్‌ టౌన్‌, నవంబర్‌ 15: ‘ఇసుక మాఫియాలో కరీంనగర్‌ నంబర్‌ వన్‌.. ఇక్కడ గ్రానైట్‌ మాఫియా.. గుట్కా మాఫియా.. భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పెద్ద దొరకు, చిన్నదొరకు ఇవ్వాల్సిన కమీషన్లు అందుతున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించలేదు. కేసులు కూడా పెట్టడంలేదు’ అని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర 238వ రోజు కరీంనగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో ఇసుక మాఫియా మంత్రి గంగుల కమలాకర్‌ గుప్పిట్లోనే ఉందని, దీని గురించి ప్రశ్నించే వారే లేరని, ఒకవేళ ప్రశ్నిస్తే డబ్బులు చల్లుతారని, వినకుంటే దాడులు చేస్తారన్నారు. కరీంనగర్‌లో రౌడీ రాజ్యం నడుస్తోందని, న్యాయం, ధర్మం ఇక్కడ బతికి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రానైట్‌ మాఫియాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సంజయ్‌, గంగుల కమలాకర్‌ ఇద్దరూ ఒక్కటేనని, ఇద్దరికీ అవినీతిలో వాటాలున్నాయని ఆరోపించారు.

Updated Date - 2022-11-16T04:06:14+05:30 IST

Read more