ఘనంగా మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-09-10T08:26:44+05:30 IST

కార్మిక , ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోయిన్‌పల్లిలో ఘనంగా జరిగాయి.

ఘనంగా మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు

మేడ్చల్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కార్మిక , ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోయిన్‌పల్లిలో ఘనంగా జరిగాయి. పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలివచ్చి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే వివేకానంద, మేడ్చల్‌ జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, సీఎంఆర్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి తదితరులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి మల్లారెడ్డి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. 

Read more