TS News: సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్

ABN , First Publish Date - 2022-08-07T13:55:23+05:30 IST

నిర్మల్: బాసర (Basara) జ్ఞాన సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) దర్శించుకున్నారు. వేద పండితులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ‘అమ్మవారిని

TS News: సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్

నిర్మల్: బాసర (Basara) జ్ఞాన సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) దర్శించుకున్నారు. వేద పండితులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ‘అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. అమ్మవారి దీవెనలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నా’నని  గవర్నర్ పేర్కొన్నారు. కాగా అమ్మవారి దర్శనానికి గవర్నర్ వెళ్ళిన సమయంలో.. పోలీసులు మీడియాను ఆలయం లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరుపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో విద్యార్థుల సమస్యలను ఆమె తెలుసుకోనున్నారు. 

Read more