29న ముస్లింలకు ప్రభుత్వ ఇఫ్తార్‌ విందు

ABN , First Publish Date - 2022-04-24T08:38:18+05:30 IST

రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇఫ్తార్‌ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు.

29న ముస్లింలకు ప్రభుత్వ ఇఫ్తార్‌ విందు

మత సామరస్యానికి వేదిక తెలంగాణ: కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇఫ్తార్‌ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ నెల 29న (శుక్రవారం) సాయంత్రం 6.10 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొంటారని తెలిపారు. గంగా జమున తెహజీబ్‌కు వేదికగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందన్నారు.

Read more