గిరిజనులను వేధిస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-02-19T07:40:15+05:30 IST

రాష్ట్రంలోని గిరిజనులను తెలంగాణ ప్రభుత్వం

గిరిజనులను వేధిస్తున్న ప్రభుత్వం

  • బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సమీర్‌ ఓరన్‌ 


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజనులను తెలంగాణ ప్రభుత్వం అణిచివేస్తోందని బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు సమీర్‌ ఓరన్‌ ధ్వజమెత్తారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ పాలన అస్తవ్యస్తంగా ఉందని, ఆయన కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను మాత్రమే చేస్తున్నారన్నారు. గిరిజన నిధులనూ పక్కదారి పట్టిస్తున్నారని, ఆదివాసీలకు భూ పట్టాలు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు.


Read more