TS News: యూనివర్సిటీల్లో సమస్యలను ప్రభుత్వం ద‌ృష్టికి తీసుకెళ్తా: గవర్నర్ తమిళి పై

ABN , First Publish Date - 2022-08-07T13:34:42+05:30 IST

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ గత కొన్ని మాసాలుగా వార్తల్లో నిలుస్తోంది. సరైన వసతులు లేవని, భోజనశాల నిర్వహణ బాగోలేదని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల ఆహారం కలుషితమై

TS News: యూనివర్సిటీల్లో సమస్యలను ప్రభుత్వం ద‌ృష్టికి తీసుకెళ్తా: గవర్నర్ తమిళి పై

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) గత కొన్ని మాసాలుగా వార్తల్లో నిలుస్తోంది. సరైన వసతులు లేవని, భోజనశాల నిర్వహణ బాగోలేదని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ తమిళి సై (Governor Tamilisai)కి స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్ ట్వీట్ చేసింది. క్యాంపస్‌లో ‘అధికారులు మా చేతులు కట్టేశారు...మా నోర్లు మూయించారంటూ’ క్యాంపస్‌లోని సమస్యలను అందులో ఏకరువు పెట్టారు. తమతో భేటి కావాలని గవర్నర్‌ను కోరారు. 


దీంతో ఆదివారం ఉదయం గవర్నర్ బాసర ట్రిబుల్ ఐటీకి చేరుకున్నారు. వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ కుమార్ ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎబిఎన్‌ ప్రతినిధితో గవర్నర్ మాట్లాడారు. ‘‘యూనివర్సిటీల్లో సమస్యలపై నిత్యం విద్యార్థుల నుంచి నాకు ఫిర్యాదులు వస్తున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలో గత 2 నెలలుగా విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. గవర్నర్‌గా నా పరిధి మేరకు విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వనికి సిఫార్సు చేస్తా. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ‌ల్లో చాలా సమస్యలు ఉన్నాయి. బాసరా ట్రిపుల్ ఐటీతో పాటు తెలంగాణలోని మిగతా యూనివర్సిటీలను సందర్శిస్తా. నా పర్యటన ఎవరికి వ్యతిరేకం కాదు. రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు.’’ అని పేర్కొన్నారు.

Read more