గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-01T08:17:20+05:30 IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గూడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్‌ మోటార్ల ట్రయల్‌ రన్‌ ఆరంభమైంది.

గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ ప్రారంభం

అక్కన్నపేట, జూలై 31 : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గూడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్‌ మోటార్ల ట్రయల్‌ రన్‌ ఆరంభమైంది. ఆదివారం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ మోటార్‌ స్విచ్ఛాన్‌ చేయడంతో గోదావరి జలాలు ప్రాజెక్టులోకి పరవళ్లు తొక్కాయి. అనంతరం గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు మోటార్లకు బదులు ఒక్క మోటారును ప్రారంభించి పది నిమిషాల పాటు ట్రయల్‌రన్‌ చేపట్టి తూతూ మంత్రంగా ముగించేశారు. గుట్టుచప్పుడు కాకుండా ట్రయల్‌రన్‌ చేపట్టడంపై గౌరవెల్లి భూనిర్వాసితులతో పాటు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరిహారం డబ్బు చెల్లించకుండా దొంగచాటుగా ట్రయల్‌రన్‌ చేయించిన వొడితెల సతీ్‌షకుమార్‌ను హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు గౌరవెల్లి భూ నిర్వాసితులు ఆదివారం రాత్రి తమ చెప్పులతో చెంపలపై కొట్టుకుంటూ నిరసన వ్యక్తంచేశారు. 

Read more