Good news for TRS: జాతీయ పార్టీ ప్రకటన ముందు టీఆర్‌ఎస్‌కు గుడ్ న్యూస్..!

ABN , First Publish Date - 2022-10-05T18:12:07+05:30 IST

సీఎం కేసీఆర్ (cm kcr) జాతీయ పార్టీ ప్రకటన ముందు టీఆర్‌ఎస్‌ (trs)కు శుభవార్త అందింది. ఈ శుభవార్త ఏమంటే..

Good news for TRS: జాతీయ పార్టీ ప్రకటన ముందు టీఆర్‌ఎస్‌కు గుడ్ న్యూస్..!

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (cm kcr) జాతీయ పార్టీ ప్రకటన ముందు టీఆర్‌ఎస్‌ (trs)కు శుభవార్త అందింది. ఈ శుభవార్త ఏమంటే.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నల్లాల ఓదేలు తిరిగి గులాబీ గూటికి వచ్చారు. ఆయన ఈ రోజు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఓదేలుకు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి కేసీఆర్ ఆహ్వానించారు. ఇటీవల నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జెడ్పీ చైర్మన్‌ భాగ్యలక్ష్మి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరినప్పటికీ జిల్లా కాంగ్రెస్‌ (Congress) నేతల మధ్య ఏమాత్రం సఖ్యత కుదరడం లేదనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ గూటికి చేరిన ఓదెలు దంపతులకు ఆ సంబురం మూణ్నాళ్ల ముచ్చటగానే సాగింది. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం సహాయ నిరాకరణ చేస్తుండడంతో ఓదెలు ఒత్తిడికి లోనవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చాలా మంది సీనియర్లు మౌనం దాల్చడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి దూరంగా ఉంటుండటంతో ఓదెలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. 


కాంగ్రెస్ నుంచి ఆశించిన మద్దతు లేకపోవడం, వెంట వస్తారనుకున్న వాళ్ళు కూడా వెనుకా ముందు ఆలోచిస్తుండడంతో ఓదెలు జీర్ణించుకోలేక పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో ఓదేలు తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఓదేలులో పాటు ఆయన సతీమణి మంచిర్యాల జడ్పీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మిని కూడా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఓదెలు తన రాజకీయ జీవితాన్ని టీఆర్‌ఎస్‌తో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2010లో రాజీనామా చేసి.. మరోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓదేలు విజయం సాధించారు.

Updated Date - 2022-10-05T18:12:07+05:30 IST