Ganesh immersion: నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంతృప్తి

ABN , First Publish Date - 2022-09-08T17:40:37+05:30 IST

ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు గురువారం ఉదయం పరిశీలించారు.

Ganesh immersion: నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంతృప్తి

హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జ (Ganesh immersion)న ఏర్పాట్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు గురువారం ఉదయం పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు (Bhagavanth rao) మాట్లాడుతూ... ఈ ఏర్పాట్ల కోసమే తాము ఆందోళన చేశామని తెలిపారు. ఆలస్యమైనా భారీగా ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి దీనిని ఆపాదించడం సమంజసం కాదన్నారు. అన్ని పార్టీలతో ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారని స్పష్టం చేశారు. మతానికి సంబంధించి కూడా కాదని.. కేవలం ఘనంగా ఉత్సవాలు జరగడమే కావాలని అన్నారు. అన్ని మతాల వాళ్ళు ఉత్సవాల్లో పాల్గొంటారని భగవంత రావు వెల్లడించారు. 


శోభాయాత్రకు ఏర్పాట్లు ప్రారంభం...

కాగా... ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు సిద్ధమవుతున్నాడు. రేపటి శోభాయాత్ర కోసం ఖైరతాబాద్ ఉత్సవ నిర్వహకులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఒకరోజు ముందుగానే మండపం షెడ్డు తొలగించారు. మట్టి గణపతి కావడంతో నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రక్ వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మరోవైపు చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు ఖైరతాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి.

Updated Date - 2022-09-08T17:40:37+05:30 IST