గెలిచిన తర్వాతే నిధులు

ABN , First Publish Date - 2022-08-17T10:20:48+05:30 IST

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచిన తర్వాతే గ్రామాలకు అభివృద్ధి నిధులు మంజూరవుతాయని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు.

గెలిచిన తర్వాతే నిధులు

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 16: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచిన తర్వాతే గ్రామాలకు అభివృద్ధి నిధులు మంజూరవుతాయని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మాట్లాడుతూ.. చౌటుప్పల్‌ మండలానికి రావాల్సిన రూ.7.50కోట్ల నిధులను నేటికీ ఎందుకు మంజూరు చేయడంలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ప్రత్యేక నిధులు రూ.25లక్షలు జిల్లాలోని అన్ని గ్రామాలకు ఇచ్చినా తమ మండలానికి మంజూరు చేయలేదని, నిధులులేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఇలాగైతే గ్రామాల్లో తిరిగి ప్రజలను ఓట్లు ఎలా అడుగుతామని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఎలాంటి నిధులు మంజూరు చేసినా ప్రతిపక్షం దాన్ని అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని, గెలిచిన తర్వాత అన్ని గ్రామాలకు నిధులు మంజూరవుతాయని సర్పంచ్‌లకు మంత్రి హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-08-17T10:20:48+05:30 IST