టీచర్ల చలో అసెంబ్లీకి సంపూర్ణ మద్దతు

ABN , First Publish Date - 2022-09-13T10:11:24+05:30 IST

దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మంగళవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

టీచర్ల చలో అసెంబ్లీకి సంపూర్ణ మద్దతు

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి 

హైదరాబాద్‌, సెస్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):  దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మంగళవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోమవారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. శాసన మండలి సమావేశాల సందర్భంగా విద్యార్ధులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేస్తే అనుమతించలేదన్నారు. ప్రభుత్వ మండల, జిల్లాపరిషత్తు, సంక్షేమ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చలో అసెంబ్లీని విరమింపజేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 

Read more