పోలీసుల పిల్లలకు ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2022-03-18T09:19:46+05:30 IST

రాచకొండ పోలీస్‌ సిబ్బంది పిల్లలకు ఐఐటీ, జేఈఈ, నీట్‌లో ఉచితంగా ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వడానికి బీవైజేయూ, స్మైల్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు.

పోలీసుల పిల్లలకు ఉచిత శిక్షణ

హైదరాబాద్‌ సిటీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాచకొండ పోలీస్‌ సిబ్బంది పిల్లలకు ఐఐటీ, జేఈఈ, నీట్‌లో ఉచితంగా ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వడానికి బీవైజేయూ, స్మైల్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ కార్యక్రమాన్ని సిబ్బంది ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బీవైజేయూ, స్మైల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో గురువారం సీపీని కలిశారు. మహారాష్ట్ర ఏసీపీ సంగీతా ఆల్ఫాన్సో, స్మైల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు ధీరజ్‌ అహూజా, ఉమా అహూజాలను సీపీ అభినందించి సత్కరించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా రాచకొండ పోలీస్‌ సిబ్బంది పిల్లలకు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత ఆన్‌లైన్‌ విద్యతో పాటు.. ఐఐటీ, జేఈఈ, నీట్‌లో ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, డీసీపీ రక్షితా మూర్తి, ఐటీసెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, పోలీస్‌ అఽధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి పాల్గొన్నారు. 

Read more