TS News: ఈతకు వెళ్లి నలుగురు మృతి

ABN , First Publish Date - 2022-10-02T22:36:06+05:30 IST

రంగారెడ్డి: యాచారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాడిపర్తి గ్రామపంచాయతీ గొల్లగూడ గ్రామ సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో పడి నలుగురు పిల్లలు మృతి చెందారు. దసరా సెలవులు ఇవ్వడంతో అబ్దుల్‌ రహీం కుటుంబానికి చెందిన బాలిక, ముగ్గురు బాలురు కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నారు. ఆదివారం కావడం

TS News: ఈతకు వెళ్లి నలుగురు మృతి

రంగారెడ్డి: యాచారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాడిపర్తి గ్రామపంచాయతీ గొల్లగూడ గ్రామ సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో పడి నలుగురు పిల్లలు మృతి చెందారు. దసరా సెలవులు ఇవ్వడంతో అబ్దుల్‌ రహీం కుటుంబానికి చెందిన బాలిక, ముగ్గురు బాలురు కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నారు. ఆదివారం కావడంతో సరదా కోసం ఈతకు వెళ్లారు. ఎర్రగుంట చెరువులో దిగారు. చెరువులో లోతు ఎక్కువగా ఉండటంతో నీళ్లలో మునిగి, ఊపిరాడకపోవడంతో మరణించారు. చిన్నారులు  సమాచారం అందుకున్న పిల్లల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతి చెందిన వారిని ఇమ్రాన్‌(9), రేహాన్‌(10), ఖలీద్‌(12), సమ్రీన్‌(14)గా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. Read more