వీధి కుక్కను చంపిన నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2022-08-21T08:21:28+05:30 IST

ఓ వీధి కుక్కను అమానుషంగా కొట్టి చంపి, ఆపై బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి కరీంనగర్‌ జిల్లా కొత్తపెల్లి పోలీసులు శనివారం నలుగురిని అరెస్టు చేశారు.

వీధి కుక్కను చంపిన నలుగురి అరెస్టు

మేనకా గాంధీ వినతికి స్పందించిన కరీంనగర్‌ పోలీసులు

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 20: ఓ వీధి కుక్కను అమానుషంగా కొట్టి చంపి, ఆపై బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి కరీంనగర్‌ జిల్లా కొత్తపెల్లి పోలీసులు శనివారం నలుగురిని అరెస్టు చేశారు. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ  చేసిన వినతి మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. కొత్తపెల్లి మండలంలోని సంగం క్రాస్‌ రోడ్డు వద్ద ఈ నెల 15న కొందరు వ్యక్తులు ఓ వీధి కుక్కను చంపారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో చూసిన హైదరాబాద్‌కు చెందిన పృథ్వీ పన్నీరు ఈ విషయాన్ని మేనకా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె శుక్రవారం రాత్రి కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ సత్యనారాయణతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన పోలీసులు.. పృథ్వీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Read more