Ponnam prabhakar: కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నది వినోదే

ABN , First Publish Date - 2022-09-26T17:08:55+05:30 IST

సిరిసిల్లపై మాజీ ఎంపీ వినోద్ వివక్ష చూపుతున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

Ponnam prabhakar: కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నది వినోదే

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లపై మాజీ ఎంపీ వినోద్ (Vinod) వివక్ష చూపుతున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Ponnam prabhakar) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నది వినోద్ కుమారే అని విమర్శించారు. మెడికల్, టెక్స్‌టైల్ క్లస్టర్‌ను సిరిసిల్లకు రాకుండా చేశారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక నాయకులు లేరా అని ప్రశ్నించారు. వినోద్ లాగే వేములవాడ, సిరిసిల్ల ఎమ్మెల్యేలు కూడా స్థానికేతరులే అని పొన్నం ప్రభాకర్ (Congress) చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-09-26T17:08:55+05:30 IST