1,392 జేఎల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-12-10T03:17:01+05:30 IST

రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. ఇంటర్మీడియెట్‌ విద్యా విభాగంలో 1,392 జూనియర్‌ లెక్చరర్ల (జేఎల్‌) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

1,392 జేఎల్‌ పోస్టుల భర్తీకి   నోటిఫికేషన్‌ విడుదల

ఈ నెల 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ

జూన్‌ లేదా జూలైలో రాత పరీక్షకు అవకాశం

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. ఇంటర్మీడియెట్‌ విద్యా విభాగంలో 1,392 జూనియర్‌ లెక్చరర్ల (జేఎల్‌) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మల్టీజోన్‌-1లో 724 పోస్టులు, మల్టీ జోన్‌-2లో 668 పోస్టుల భర్తీకిగాను ఈ నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 2023 జనవరి 6 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీఎ్‌సపీఎస్సీ సూచించింది. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష వచ్చే ఏడాది జూన్‌/జూలై నెలల్లో ఉండే అవకాశం ఉందని తెలిపింది. కాగా..ఈ 1392 జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల్లో ఉర్దూ, మరాఠీ మీడియం పోస్టులకు పదో తరగతి వరకు ఆయా మీడియంలలో చదువుకున్నవారు లేదా పది/ఎ్‌సఎస్సీలో ఆయా భాషలు ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఉన్నా.. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో సెకండ్‌ లాంగ్వేజ్‌గా ఉన్న వారు ఈ మీడియంలోని పోస్టులకు అర్హులని విద్యాశాఖ వెల్లడించింది. జేఎల్‌ సివిక్స్‌ పోస్టులకు పొలిటికల్‌ సైన్స్‌ లేదా పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ సబ్జెక్టుల్లో పీజీ చేసి 50 శాతం మార్కులు పొందిన వారు అర్హులని పేర్కొంది. మరోవైపు వైద్య, ఆరోగ్యశాఖలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకిగాను గత నెల 7న విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి మెరిట్‌ లిస్ట్‌ను టీఎ్‌సపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల షార్ట్‌ లిస్ట్‌ జరుగుతుందని టీఎ్‌సపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం పరీక్ష కోసం రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 18న పరీక్ష జరుగుతుందని, శాఖ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్‌ డైరెక్టర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - 2022-12-10T03:17:02+05:30 IST