దక్షిణ మధ్య రైల్వేకు ఐదు పర్యావరణ అవార్డులు

ABN , First Publish Date - 2022-09-17T10:51:44+05:30 IST

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ వారోత్సవాల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌తోపాటు రైల్వేలోని నాలుగు విభాగాలు గ్రీన్‌కో-సర్టిఫికెట్ల (పర్యావరణ అవార్డు)ను సొంతం చేసుకున్నాయి.

దక్షిణ మధ్య రైల్వేకు ఐదు పర్యావరణ అవార్డులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ వారోత్సవాల్లో  దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌తోపాటు రైల్వేలోని నాలుగు విభాగాలు గ్రీన్‌కో-సర్టిఫికెట్ల (పర్యావరణ అవార్డు)ను సొంతం చేసుకున్నాయి. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు గుర్తింపుగా గ్రీన్‌కో అవార్డులను సాధించినట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు గ్రీన్‌కో ప్లాటినం రేటింగ్‌, తిరుపతి క్యారేజీ రిపేర్‌ షాపునకు గ్రీన్‌కో గోల్డ్‌ రేటింగ్‌, మౌలాలి డీజిల్‌ లోకోషెడ్‌ కు గ్రీన్‌కో గోల్డ్‌ రేటింగ్‌, కాజీపేట్‌ ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌కు గ్రీన్‌కో సిల్వర్‌ రేటింగ్‌, విజయవాడ డీజిల్‌ లోకో షెడ్‌కు గ్రీన్‌కో సిల్వర్‌ రేటింగ్‌ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

Read more