బాలుడి గుండె ఆపరేషన్‌కు MPTC ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2022-09-10T16:17:15+05:30 IST

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరు నెలల బాలుడి ఆపరేషన్‌ కోసం లష్కర్‌గూడ ఎంపీటీసీ సీక సాయికుమార్‌గౌడ్‌

బాలుడి గుండె ఆపరేషన్‌కు MPTC ఆర్థిక సాయం

హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరు నెలల బాలుడి ఆపరేషన్‌ కోసం లష్కర్‌గూడ ఎంపీటీసీ(MPTC) సీక సాయికుమార్‌గౌడ్‌ రూ. 20వేల సాయం అందజేసి బాలుడి కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. అబ్దు ల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడ గ్రామానికి చెందిన ఎండీ సోహెల్‌ కుమారుడు ఎండీ అసద్‌(6 నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యులను సంప్రదించగా గుండె ఆపరేషన్‌ చేయాలని సూచించారు. దాంతో నగరంలోని స్టార్‌ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న లష్కర్‌గూడ ఎంపీటీసీ సాయికుమార్‌గౌడ్‌ శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి బాలుడి కుటుంబ సభ్యులకు 20వేల నగదును అందజేసి వారికి ధైర్యం చెప్పారు. బా లుడి ఆపరేషన్‌ కోసం దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కో-ఆప్షన్‌ సభ్యుడు గౌస్‌పాషా, పాతి ప్రసాద్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Read more