రైతుల రుణాలు వెంటనే మాఫీ చేయాలి : జక్కలి

ABN , First Publish Date - 2022-12-13T00:31:38+05:30 IST

రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను వెంట నే మాఫీ చేయాలని టీడీపీ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐ లయ్యయాదవ్‌ డిమాండ్‌ చే శారు. సోమవారం మర్రిగూడ లో నిర్వహించిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడా రు.

 రైతుల రుణాలు వెంటనే మాఫీ చేయాలి : జక్కలి
సమావేశంలో మాట్లాడుతున్న ఐలయ్యయాదవ్‌

రైతుల రుణాలు వెంటనే మాఫీ చేయాలి : జక్కలి

మర్రిగూడ, డిసెంబరు 12: రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను వెంట నే మాఫీ చేయాలని టీడీపీ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐ లయ్యయాదవ్‌ డిమాండ్‌ చే శారు. సోమవారం మర్రిగూడ లో నిర్వహించిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడా రు. ఎన్నికల హామీ మేరకు రై తులు బ్యాంకుల్లో తీసుకున్న రూ. లక్ష పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలని డి మాండ్‌ చేశారు. 2018 ఎన్నికల సమయంలో రూ.1లక్ష వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని బీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ పెరిగి రైతులు నా నా ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే బ్యాంకుకు రుణమాఫీ నిధులు విడుదల చే యాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకుల్లో ఉన్న పాస్‌ పుస్తకాలను రైతులకు ఇప్పించాలన్నారు. సమావేశంలో బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి పగడాల లింగయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు దోమల వెంకటయ్య, నాయకులు పుప్పాల యాదయ్య, లక్ష్మి, శ్రీను, అంజ య్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:31:38+05:30 IST

Read more