అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-04T05:20:50+05:30 IST

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

చెన్నారావుపేట, జనవరి 3: వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కాల్‌నాయక్‌ తండాకు చెందిన రైతు బానోతు బుచ్యా(52) అప్పుల బాధతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బుచ్యా తన ఎకరంన్నర చెలుకతో పాటు మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి వేశాడు. పత్తి, మిరపకు తెగుళ్లు సోకి దిగుబడి రాలేదు. దీంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు, గతంలో ఉన్న అప్పులు మొత్తం రూ.10లక్షలు పేరుకుపోయాయి. ఈ క్రమంలో మనస్తాపంతో బుచ్యా ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే అతడిని హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుచ్యా మృతి చెందాడు. మృతుడికి భార్య అమల, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బిచ్యా కుమారుడు తరుణ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. 

Read more