అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-10T08:41:10+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మం డలం నిసానిలో రైతు నల్ల సాయిరెడ్డి (26) అప్పుల బాధ తో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

భీంపూర్‌, సెప్టెంబరు 9: ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మం డలం నిసానిలో రైతు నల్ల సాయిరెడ్డి (26) అప్పుల బాధ తో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆరెకరాల్లో సోయా సాగు చేసిన సాయిరెడ్డి పెట్టుబడి కోసం  రూ. 5లక్షల వరకు అప్పు చేశాడు. అయితే వరుస వర్షాలతో సోయా పంట పూర్తి స్థాయిలో దెబ్బతింది. దీంతో అప్పులిచ్చినవారి ఒత్తిడి తట్టుకోలేక పురుగుల మందు తాగాడు.

Read more