పముఖ కవి గన్ను కృష్ణమూర్తి కన్నుమూత

ABN , First Publish Date - 2022-09-10T09:09:30+05:30 IST

ప్రముఖ కవి, విమర్శకులు, కథా రచయిత, పరిశోధకులు గన్ను కృష్ణమూర్తి(70) శుక్రవారం కన్నుమూశారు.

పముఖ కవి గన్ను కృష్ణమూర్తి కన్నుమూత

కామారెడ్డి, సెప్టెంబరు 9: ప్రముఖ కవి, విమర్శకులు, కథా రచయిత, పరిశోధకులు గన్ను కృష్ణమూర్తి(70) శుక్రవారం కన్నుమూశారు. గత 30 ఏళ్లుగా కామారెడ్డిలో నివాసముంటున్న కృష్ణమూర్తి ఈనెల 7న రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కామర్స్‌ అధ్యాపకునిగా జీవితాన్ని ప్రారంభించిన గన్ను కృష్ణమూర్తి.. అభిలేఖిని సాహితీ వేదిక ద్వారా వెలకట్టలేని సాహితీ సేవలు అందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అనేక రచనలు చేశారు. గేయ కావ్యాలు, అనువాదాలు, దీర్ఘ కవితలు, వేద పరిశోధనలు, మినీ కవితలు, పేరడీలు, పద్య శతకములు, వేద పరిశోధన గ్రంథాలను రాశారు. 

Read more