ఫ్యాబ్‌సిటీ రైతులకు త్వరలో తీపికబురు: సబితా ఇంద్రారెడ్డి

ABN , First Publish Date - 2022-03-17T01:49:08+05:30 IST

ఫ్యాబ్‌సిటీ నిర్మాణంలో భూములు కోల్పోయి పరిహారం అందని రైతులకు త్వరలో తీపికబురు వస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఫ్యాబ్‌సిటీ రైతులకు త్వరలో తీపికబురు: సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: ఫ్యాబ్‌సిటీ నిర్మాణంలో భూములు కోల్పోయి పరిహారం అందని రైతులకు త్వరలో తీపికబురు వస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫ్యాబ్‌ సిటీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రావిర్యాల గ్రామరైతులకు పరిహారాన్ని అందించే విషయంలో తీవ్రజాప్యం జరిగిందని తెలిపారు. పరిహారం అందక రైతు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిసమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ ఈసమస్య పరిష్కారానికి పలుమార్లు ఉన్నతస్థాయిలో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కారమార్గాన్ని చూపారని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు త్యాగంచేసిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు కలిగించొద్దని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

Read more