నెలాఖరు వరకూ ‘ఓటీఎస్‌’ గడువు పెంపు

ABN , First Publish Date - 2022-07-05T10:13:28+05:30 IST

వివిధ రకాల పన్ను బకాయిల వసూలు కోసం తీసుకొచ్చిన ‘వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)’ స్కీమ్‌ గడువును ప్రభుత్వం ఈ నెల 31 వరకు పొడిగించింది.

నెలాఖరు వరకూ ‘ఓటీఎస్‌’ గడువు పెంపు

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వివిధ రకాల పన్ను బకాయిల వసూలు కోసం తీసుకొచ్చిన ‘వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)’ స్కీమ్‌ గడువును ప్రభుత్వం ఈ నెల 31 వరకు పొడిగించింది. జనరల్‌ సేల్‌ టాక్స్‌, వ్యాట్‌, సెంట్రల్‌ సేల్‌ టాక్స్‌ల బకాయిల వసూలుకు ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌లోకి ఇటీవలే లగ్జరీ, ఎంటర్‌టెయిన్‌మెంట్‌ టాక్స్‌, రోడ్డు డెవల్‌పమెంట్‌(ఆర్‌డీ) సెస్‌, ప్రొఫెషన్‌ టాక్స్‌, ఇతర ప్రాంతాల నుంచి స్థానిక ప్రాంతాలకు ప్రవేశించే వాహనాలపై వసూలు చేసే ఎంట్రీ టాక్స్‌లను కూడా చేర్చింది.  స్కీమ్‌ను వినియోగించుకోవాలనుకునే వ్యాపారులు, డీలర్లు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. దరఖాస్తులను ఆగస్టు 15లోపు స్ర్కూటినీ చేసి, ఎవరు ఎంత చెల్లించాల్సి ఉంటుందో వెల్లడిస్తామని వివరించారు. ఆ మొత్తాన్ని ఆగస్టు 31లోపు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-05T10:13:28+05:30 IST