‘మధుమేహం’పై వ్యాసరచన పోటీలు శ్రీచైతన్య విద్యార్థుల హవా

ABN , First Publish Date - 2022-11-16T03:48:38+05:30 IST

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మధుమేహ వ్యాధి కారణాలు, నివారణ చర్యలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో తమ సంస్థ విద్యార్థులే ఎక్కువ బహుమతులను గెలుచుకున్నారని శ్రీచైతన్య విద్యా సంస్థ ప్రకటించింది.

‘మధుమేహం’పై వ్యాసరచన పోటీలు శ్రీచైతన్య విద్యార్థుల హవా

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మధుమేహ వ్యాధి కారణాలు, నివారణ చర్యలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో తమ సంస్థ విద్యార్థులే ఎక్కువ బహుమతులను గెలుచుకున్నారని శ్రీచైతన్య విద్యా సంస్థ ప్రకటించింది. విజయవాడలో మంగళవారం నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. వీజీఆర్‌ డయాబెటిక్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, శ్రీచైతన్య స్కూల్‌ ఈ పోటీలను నిర్వహించినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో మొత్తం 40,358 మంది విద్యార్థులు పాల్గొనగా, 34,330 మంది శ్రీచైతన్య విద్యార్థులే పాల్గొన్నారు. మొత్తం 2,892 మంది విద్యార్థులు బహుమతులు గెలుపొందగా, అందులో 2,295 మంది శ్రీచైతన్య విద్యార్థులేన నిపేర్కొన్నారు. విజేతలను శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్‌ బీఎస్‌ రావు, డైరెక్టర్‌ సీమ అభినందించారు.

==============

Updated Date - 2022-11-16T03:48:38+05:30 IST

Read more