గిరిజన పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం: మంత్రి సత్యవతి

ABN , First Publish Date - 2022-06-11T08:59:44+05:30 IST

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 1,430 ప్రాథమిక పాఠశాలలు, 326 ఆశ్రమ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మార్చినట్లు మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు.

గిరిజన పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం: మంత్రి సత్యవతి

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 1,430 ప్రాథమిక పాఠశాలలు, 326 ఆశ్రమ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మార్చినట్లు మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధనపై టీచర్లందరికీ ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. గిరిజన పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంపై ‘బడి బాట’ కార్యక్రమంలో విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో విద్యా సంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని ఐటీడీఏల ప్రాజెక్టు ఆఫీసర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులతో డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి సత్యవతి రాథోడ్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆదివాసి ప్రాంతాల్లో విద్యాలయాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Read more