జేఎన్‌టీయూ పరిధిలో ఇంజనీరింగ్‌ కాలేజీల ‘గుర్తింపు’ కొలిక్కి

ABN , First Publish Date - 2022-06-12T08:45:18+05:30 IST

జేఎన్‌టీయూ పరిధిలో ఇంజనీరింగ్‌ కాలేజీల ‘గుర్తింపు’ కొలిక్కి

జేఎన్‌టీయూ పరిధిలో ఇంజనీరింగ్‌ కాలేజీల ‘గుర్తింపు’ కొలిక్కి

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీల గుర్తింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఏటా ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ ప్రారంభానికి ముందే కాలేజీలు యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుంది. తెలంగాణలో జేఎన్‌టీయూ, ఓయూల పరిధిలో ఎక్కువగా ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ వర్సిటీల నుంచి కళాశాలలు ఏటా గుర్తింపును పొందాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు జారీ చేసే ముందు వర్సిటీ అధికారులు కాలేజీలను తనిఖీ చేస్తారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా కాలేజీలకు యూనివర్సిటీలు గుర్తింపును ఇస్తాయి. 

Read more