ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 23 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-24T12:46:57+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 23 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 23 గేట్లు ఎత్తి 2లక్షల 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2.18 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం  20.175 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 14.3597 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-07-24T12:46:57+05:30 IST