తెలంగాణలో జ్యోతిషం ప్రకారం ఎన్నికలు

ABN , First Publish Date - 2022-11-30T01:54:44+05:30 IST

తెలంగాణలో ఎన్నికలపై సుప్రీం కోర్టు వ్యంగ్యాస్త్రం సంధించింది. ‘‘తెలంగాణలో జ్యోతిషం ప్రకారం 2018 ఎన్నికలు వచ్చాయి.

తెలంగాణలో జ్యోతిషం ప్రకారం ఎన్నికలు

సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్య

న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎన్నికలపై సుప్రీం కోర్టు వ్యంగ్యాస్త్రం సంధించింది. ‘‘తెలంగాణలో జ్యోతిషం ప్రకారం 2018 ఎన్నికలు వచ్చాయి. అక్కడ జ్యోతిషం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ కేసును విచారించాలంటే కూడా గ్రహాలన్నీ ఒక వరుసలోకి రావాలేమో..?’’ అని న్యాయమూర్తి జస్టిస్‌ వీ.రామసుబ్రమణియన్‌ చమత్కంచారు. 2018 ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల వివరాలను పూర్తిగా పొందుపర్చలేదని, ఆయనపై అనర్హతవేటు వేయాలని ఓడిపోయిన అభ్యర్థి ప్రేమ్‌ సింగ్‌ రాథోడ్‌ పిటిషన్‌ వేశారు. ఆ వ్యాజ్యం మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ వీ.రామసుబ్రమణియన్‌ ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణను వాయిదా వేయాలని రాథోడ్‌ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయగా ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.

Updated Date - 2022-11-30T01:54:44+05:30 IST

Read more