చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2022-07-06T15:56:34+05:30 IST

ప్రముఖ మొబైల్ బ్రాండ్, చైనాకు చెందిన వీవో సంస్థ భారత కార్యాలయాల్లో ఈడీ సోదాలు

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ బ్రాండ్, చైనాకు చెందిన వీవో సంస్థ భారత కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో దేశవ్యాప్తంగా 44 చోట్ల ఈడీ ఈ తనిఖీలను చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. 

వివో, ఒప్పోతో పాటు అనుబంధ కంపెనీల్లో ఈడీ తనిఖీలను చేపట్టింది. హైదరాబాద్ లోని ఒప్పో కార్యాలయంలోనూ సోదాలు కొగసాగుతున్నాయి. గతంలో ఫెమా ఉల్లంఘన కింద షియోమీ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ, ఏడాది కాలంగా లావాదేవీలు, సర్వర్, నెట్వర్క్ పై ఈడీ దర్వాప్తును చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వం చైనాకు సంబంధించిన పెద్ద బ్రాండ్ కంపెనీలపై దృష్టి సారించింది. 

Updated Date - 2022-07-06T15:56:34+05:30 IST