‘తూర్పు’ టీఆర్‌ఎ్‌సలోరగడ

ABN , First Publish Date - 2022-06-07T05:33:46+05:30 IST

‘తూర్పు’ టీఆర్‌ఎ్‌సలోరగడ

‘తూర్పు’ టీఆర్‌ఎ్‌సలోరగడ
కొత్తవాడ శ్మశానవాటికలో ఎమ్మెల్సీ, మేయర్‌, కమిషనర్‌

కొత్తవాడ శ్మశానవాటిక పరిశీలనకు మేయర్‌, ఎమ్మెల్సీ రాక

అడ్డుకున్న స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు

ఎమ్మెల్యే, అధికారపార్టీ కార్పొరేటర్లు లేని సమయంలో ఎలా పర్యటిస్తారని నిలదీత

ఇరువర్గాల మధ్య తోపులాట... సర్దిచెప్పిన పోలీసులు...

మట్టెవాడ(వరంగల్‌), జూన్‌ 6: వరంగల్‌ తూర్పు ని యోజకవర్గంలో అధికార పార్టీలో రాజకీయం మరోసారి వేడెక్కింది. అంతర్గత విభేధాలు మరోసారి రచ్చకెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు లేని సమయంలో ఎలా పర్యటిస్తారని ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ ప్రావీణ్యను టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.  వివరాల్లోకి వెళితే.. 

కార్పొరేటర్‌ గందె కల్పన తల్లి పెద్దపల్లిలో మృతి చెం దడంతో సోమవారం స్థానిక ఎమ్మెల్యే నరేందర్‌తో పా టు, పలువురు కార్పొరేటర్లు అక్కడికి వెళ్లారు. ఈక్ర మంలో వరంగల్‌ కొత్తవాడలోని (22వ డివిజన్‌) హిం దూ శ్మశాన వాటికను సందర్శించేందుకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వచ్చారు.  ఈ శ్మశానవాటిక ఐదు డివిజన్ల పరిధిలో ఉంది. ముగ్గురు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఒకరు బీజేపీ, మరొకరు స్వతంత్ర కార్పొరేటర్‌ ఉన్నారు.  

ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకుడు నీ లం రాజ్‌కిశోర్‌, ఇతర నాయకులు అక్కడికి చేరుకున్నా రు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ముగ్గురు కా ర్పొరేటర్లు స్థానికంగా లేని సమయంలో సందర్శన కార్యక్రమం ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ, స్వతంత్ర కా ర్పొరేటర్లు చెప్పగానే శ్మశాన వాటికను సందర్శిస్తారా..? అ ధికార పార్టీ కార్పొరేటర్లకు విలువన్విరా...? అని నిలదీశా రు. సారయ్య శ్మశానవాటికలోకి వెళ్లకుండా లోపలి నుం చి గేటుకు గొల్లెం వేశారు. దీంతో సారయ్య ఆగ్రహం వ్య క్తం చేయడంతోపాటు పోలీసు  ఉన్నతాధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారమందించారు. మరోపక్క సారయ్య వర్గీయులు టీఆర్‌ఎస్‌ నాయకులతో బాహాబాహీకి దిగారు.  

ఇదే సమయంలో శ్మశానవాటిక వద్దకు మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ ప్రావీణ్య చేరుకున్నారు. ఐదు డివిజన్లకు సంబంధించిన శ్మశానవాటిక, ము గ్గురు అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యే లేకుండా కేవలం బీజేపీ,  స్వతంత్ర కార్పొరేటర్ల మాటలకే విలువనిస్తారా అంటూ ఎమ్మెల్సీ, మేయర్‌, కమిషనర్‌ను ఎమ్మెల్యే వర్గం నాయకులు నిలదీశారు. ఎమ్మెల్యే నరేందర్‌, కార్పొరేటర్లు పెద్దపల్లి జిల్లాకు వెళ్లిన విషయం తెలిసి కావాలనే కొత్తవాడ శ్మశాన వాటిక సందర్శన కార్యక్రమం పెట్టుకున్నారని ఆరోపించారు. 

అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఇలా అవమానిస్తారా అంటూ గొడవకు దిగారు. ఈ క్రమంలో రాజ్‌కిశోర్‌ను ఎమ్మెల్సీ  సారయ్య గన్‌మెన్‌ కొంచెం దూరం జరగాలంటూ చేయితో నెట్టివేశాడు. దీంతో రాజ్‌కిశోర్‌తోపాటు నాయకులు ఎమ్మెల్సీ, మేయర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో మట్టెవాడ సీఐ రమేష్‌ ఆధ్వర్యంలో  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. 

 ఈ సందర్భంగడా మేయర్‌ సుధారాణి, కమిషనర్‌ ప్రావీణ్య టీఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడుతూ.. శ్మశానవాటికలో ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం లేదని, సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు వచ్చామని తెలిపారు. అనంతరం శ్మశాన వాటికలోకి వెళ్లి సమస్యలను పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్‌ ఆడెపు స్వప్న, 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ బస్వరాజు కుమారస్వామి, బీజేపీ నాయకుడు ఆడెపు శ్రీనివాస్‌ మాజీ కార్పొరేటర్లు దామెర సర్వేశం, యెలుగం శ్రీనివాస్‌ శ్మశానవాటికలోని సమస్యలను వివరించి, వినతి ప్రతం అందజేశారు.


Read more