గవర్నర్‌, సీఎం దసరా శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-10-05T09:30:16+05:30 IST

విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్‌, సీఎం దసరా శుభాకాంక్షలు

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దసరా పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. సత్యం మాత్రమే విజయం సాధిస్తుందనేది మన జాతీయ విశ్వాసం అని తెలిపారు. పచ్చదనం, ఆందమైన పరిసరాలు తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని గవర్నర్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ధర్మస్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిని పురస్కరించుకొని ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ర్టాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

Read more