చరిత్రను వక్రీకరించొద్దు: సీఎల్పీ నేత భట్టి

ABN , First Publish Date - 2022-09-17T10:47:50+05:30 IST

చరిత్రను వక్రీకరించి, మత కలహాలు సృష్టించి తెలంగాణను కబళించేందుకు మతోన్మాద శక్తులు కుట్ర చేస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.

చరిత్రను వక్రీకరించొద్దు: సీఎల్పీ నేత భట్టి

మధిర, సెప్టెంబరు 16: చరిత్రను వక్రీకరించి, మత కలహాలు సృష్టించి తెలంగాణను కబళించేందుకు మతోన్మాద శక్తులు కుట్ర చేస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిరలో శుక్రవారం తెలంగాణ జాతీయ సమ్యైకతా వజ్రోత్సవాల ర్యాలీ, అనంతరం జరిగిన సభలో టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబరు 17 విమోచన కాదని, తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజుగా పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు విమోచన పేరిట సభలు నిర్వహించడం సబబు కాదని అన్నారు. విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు పాల్గొన్నారు. 

Read more