రోగులు చెబుతుంటే డాక్టర్లు రాస్తూ పోతున్నారు

ABN , First Publish Date - 2022-09-19T08:12:18+05:30 IST

నిష్టూరమాడుతున్నట్లే ఉన్నా, వాస్తవమేమిటంటే, చాలా హాస్పిటల్స్‌లో రోగులు తమ సమస్యలు చెబుతుంటే డాక్టర్లు ప్రిస్ర్కిప్షన్‌ రాస్తూ వెళ్తున్నారు.

రోగులు చెబుతుంటే డాక్టర్లు రాస్తూ పోతున్నారు

 వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ ఆసియన్‌ సైకియాట్రీలో వక్తలు

హైదరాబాద్‌లో ముగిసిన మూడు రోజుల సదస్సు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నిష్టూరమాడుతున్నట్లే ఉన్నా, వాస్తవమేమిటంటే, చాలా హాస్పిటల్స్‌లో రోగులు తమ సమస్యలు చెబుతుంటే డాక్టర్లు ప్రిస్ర్కిప్షన్‌ రాస్తూ వెళ్తున్నారు. ఇదే రీతిలో కొనసాగితే కొన్నాళ్లకు రోగులతో ఎలా మాట్లాడాలో డాక్టర్లు మర్చిపోతారని వ్యాఖ్యానించారు యూనివర్శిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ సైకియాట్రీగా సేవలందిస్తున్న డాక్టర్‌ మోహన్‌ ఐసాక్‌. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 9వ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ ఆసియన్‌ సైకియాట్రీసదస్సులో ఆయన సైకియాట్రిక్‌ విద్య అనే అంశంపై మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రోగిని అర్ధం చేసుకుని, అతని సమస్య తెలుసుకుని దానికి తగిన పరిష్కారం చూపాల్సిన ఆవశ్యకత సైక్రియాటి్‌స్టలకు ఉందన్నారు. సైకియాట్రీ విద్యపరంగా ఇటీవలి కాలంలో మార్పులు సంభవిస్తున్నాయన్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (నిమ్హాన్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రతిమామూర్తి... కామ న్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు శుభపరిణామన్నారు. సైకియాట్రీలో కూడా పెరినాటల్‌, చైల్డ్‌, జెరియాట్రిక్‌ తదితర స్పెషలైజేషన్లు ఉండాలన్నారు. జాతీయ విద్యా విధానంలో ఎంఫిల్‌ కోర్సు తీసేశారని, దానిని తిరిగి పరిచయం చేయాలని ప్రభుత్వాన్ని కోరా రు. మెంటల్‌ హెల్త్‌ డైరెక్టరీని క్రియేట్‌ చేయాల్సిన అవసరముందని ఆసియన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైకియాట్రీ ఎడిటర్‌-ఇన్‌-చీ్‌ఫడాక్టర్‌ రాజీవ్‌ టాండన్‌ అభిప్రాయపడ్డారు. వరల్డ్‌ సైకియాట్రిక్‌ అసోసియేషన్‌లో సెక్రటరీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రోజర్‌ వెబినార్‌ ద్వారా మాట్లాడుతూ నేటి సైకియాట్రి్‌స్టలు తగినంతగా శిక్షణ పొందడం లేదన్నారు. సామాన్య మానవుని దృష్టిలో జీవితం, సంతోషం అంటే ఏమిటనే అంశంపై నేపాల్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ నిర్మల్‌ లమిచాన్‌ ఓ డాక్యుమెంటరీ ప్రదర్శించారు. మూడు రోజుల ఈ సదస్సు ఆదివారం ముగిసింది. 500కు పైగా సైకియాట్రిస్టులు హాజరయ్యారు. ఆసియావ్యాప్తంగా 38 మంది స్కాలర్స్‌కు మెంటారింగ్‌ చేసి గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్లు అందజేశారు. 

Updated Date - 2022-09-19T08:12:18+05:30 IST