మళ్లీ కేసీఆర్‌ మాయలో పడొద్దు

ABN , First Publish Date - 2022-04-24T08:37:13+05:30 IST

ఎన్నికల ముందు గారడీ మాటలు, దొంగ హామీలతో సీఎం కేసీఆర్‌ వస్తారని, మళ్లీ ఆయన మాయలో పడొద్దని ప్రజలకు వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విజ్ఞప్తి చేశారు.

మళ్లీ కేసీఆర్‌ మాయలో పడొద్దు

గారడీ మాటలు, దొంగ హామీలతో వస్తాడు: షర్మిల

అశ్వాపురం ఏప్రిల్‌ 23: ఎన్నికల ముందు గారడీ మాటలు, దొంగ హామీలతో సీఎం కేసీఆర్‌ వస్తారని, మళ్లీ ఆయన మాయలో పడొద్దని ప్రజలకు వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రజలను ఆయన రెండుసార్లు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 64వ రోజైన శనివారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు, రామవరం, భీమవరం, గొందిగూడెం, అశ్వాపురం గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా గొందిగూడెంలో నిర్వహించిన ‘రైతుగోస’ దీక్షలో షర్మిల మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా, ఉన్న భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ‘‘విత్తనాల సబ్సిడీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా రైతుబంధు ఇస్తే రైతులు కోటీశ్వరులవుతారా? రాష్ట్రంలో కౌలు రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పంటనష్టం జరిగితే పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Read more