విచారిస్తే మీ ఆందోళనలు ఎందుకు?.. బీఆర్‌ఎస్‌ నేతలపై డీకే అరుణ ధ్వజం

ABN , First Publish Date - 2022-12-12T04:11:37+05:30 IST

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారిస్తే... బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు.

విచారిస్తే మీ ఆందోళనలు ఎందుకు?.. బీఆర్‌ఎస్‌ నేతలపై డీకే అరుణ ధ్వజం

హైదరాబాద్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారిస్తే... బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు రాజకీయ కక్షల గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. ఇక్కడి పోలీసులు వారి చెప్పుచేతల్లో ఉన్నారు కాబట్టే... సీబీఐ, ఈడీలు బీజేపీవని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కవిత ఎలాంటి తప్పు చేయకుంటే ఆమె కుటుంబీకులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో సీట్ల కోసమే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కవితకు మద్దతు తెలుపుతున్నారని అరుణ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-12T04:11:37+05:30 IST

Read more