వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించండి

ABN , First Publish Date - 2022-09-08T09:35:26+05:30 IST

వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం కేసీఆర్‌కు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక విజ్ఞప్తి చేసింది.

వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించండి

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం కేసీఆర్‌కు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు  కేసీఆర్‌కు వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలో 12 లక్షల మందికిపైగా వికలాంగులున్నారని, వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  

Read more