పందిపంపుల భూములపై డిజిటల్‌ సర్వే

ABN , First Publish Date - 2022-02-23T05:51:56+05:30 IST

పందిపంపుల భూములపై డిజిటల్‌ సర్వే

పందిపంపుల భూములపై డిజిటల్‌ సర్వే

కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఫిబ్రవరి 22: భూపాలపల్లి మం డలంలోని పందిపంపుల భూములపై డిజిటల్‌ సర్వే నిర్వ హించనున్నట్లు కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపా రు. కలెక్టరేట్‌లో ఆయన మంగళ వారం రెవె న్యూ, ఫారెస్ట్‌, జెన్కో అధికారులతో సమావే శమయ్యారు. పందిపంపుల భూముల డిజిటల్‌ సర్వేపై సమీక్ష నిర్వహించారు. సర్వే నంబరు 34లోని 1057 ఎకరాల భూమిలో 667 అటవీశాఖ భూమి, 380 ఎకరాల రెవెన్యూ భూభాగాన్ని జీపీఎస్‌  ద్వారా డిజిటల్‌ సర్వే చేయనున్నట్లు తెలిపారు. జెన్కో వల్ల నష్టపో తున్న నిర్వాసితులకు త్వరలో పరిష్కారం లభించనున్నట్లు తెలిపారు. కాపురం, తాడిచెర్ల గ్రామాల్లో అర్హులైన భూనిర్వాసితులకు వారం రోజుల్లో న్యాయం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో లావణ్య, జెన్కో సీఈ సిద్ధయ్య, ఆర్డీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more