త్వరలో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ

ABN , First Publish Date - 2022-06-12T08:49:42+05:30 IST

త్వరలో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ

త్వరలో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ

 ఏర్పాటు చేయనున్నట్లు  డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడి

 

హైదరాబాద్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సైబర్‌ నేరాల కట్టడికి ‘సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ’ని త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అందులో ఐఐటీ, ఐబీఎంలతో పాటు ప్రముఖ ఐటీ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స(ఐఎ్‌సబీ)లో ‘సైబర్‌ సేఫ్టీ-నేషనల్‌ సెక్యూరిటీ’ అంశంపై శనివారం జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. వచ్చే పదేళ్లలో ఎదురయ్యే సైబర్‌ నేరాలను గుర్తించి.. వాటి నివారణను సూచించేందుకు ఈ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ పనిచేస్తుందని చెప్పారు.  సైబర్‌ నేరాల నిరోధంపై రూపొందించిన పోస్టర్లను డీజీపీ ఆవిష్కరించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌  పాల్గొన్నారు. 

Read more