‘మన ఊరు-మనబడి’తో పాఠశాలల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-11-30T00:27:42+05:30 IST

మన ఊరు- మనబడితో మారనున్న పాఠశాలల రూపురేఖలు మార నున్నాయని పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామా రావు అన్నారు. వేములవాడ అగ్రహారంలోని చీర్లవంచ ఆర్‌ అండ్‌ఆర్‌ కాలనీలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు.

‘మన ఊరు-మనబడి’తో పాఠశాలల అభివృద్ధి
మండలాల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మన ఊరు- మనబడితో మారనున్న పాఠశాలల రూపురేఖలు మార నున్నాయని పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామా రావు అన్నారు. వేములవాడ అగ్రహారంలోని చీర్లవంచ ఆర్‌ అండ్‌ఆర్‌ కాలనీలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలల్లో మౌలిక వసతులతోపాటు విద్యార్థులకు అను కూలంగా ఏర్పాట్లు చేయడంతో ‘మీ స్కూల్‌ బాగుంది’ అని ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, డీఈవో రాధాకిషన్‌కు పలు సూచనలు చేశారు. ‘మన ఊరు - మనబడి కింద’ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.40.90 లక్షలు, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రూ.27.27 లక్షలతో ఎలక్ట్రిసీటీ, కిచెన్‌ షెడ్‌, ప్రహరీ, పెయింటింగ్‌, ఫ్యాన్ల ఏర్పాటు వంటి పనులు చేసినట్లు డీఈవో వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పనులు బాగున్నాయని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ‘మనఊరు, మనబడి, మనబస్తీ - మనబడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా చేపట్టిందన్నారు. ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు అటంకాలు లేకుండా కొనసాగే విధంగా వసతులు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో మొదటి విడతలో 172 పాఠశాలల్లో రూ.20.38 కోట్లతో పనులు చేపట్టినట్లు చెప్పారు. మంత్రి వెంట జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, పవర్‌లూం టెక్స్‌ టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఆర్డీవోలు శ్రీనివాసరావు, పవన్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కమిషనర్‌ అన్వేష్‌, జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రవ్వ, సర్పంచ్‌ రంగు సత్తమ్మ, ఎంపీటీసీ వనపర్తి దేవరాజు, వేములవాడ అధ్యక్షుడు ఊరడి ప్రవీణ్‌, సర్పంచులు పాల్గొన్నారు.

జిల్లా గౌడ భవన్‌కు స్థలం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్డులో జిల్లా గౌడ భవన్‌కు రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రిని జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర నారాయణ, జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిదురు గోవర్ధన్‌గౌడ్‌తోపాటు వివిధ మండలాల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసి గౌడ భవన్‌కు స్థలం కేటాయించాలని కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్‌ బైపాస్‌ రోడ్డులో రెండెకరాల స్థలం కేటాయిస్తా మన్నారు. కేటీఆర్‌కు వీఆర్‌ఏల జేఏసీ ఆధ్వర్యంలో పదోన్న తులు, వారసులకు ఉద్యోగాలు, కారుణ్య నియామకాలకు సంబంధించిన జీవోలను అమలు చేయాలని వీఆర్‌ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు అర్జున్‌, కో కన్వీనర్లు రాధాశంకర్‌, రాజేందర్‌, శ్రీకాంత్‌, రాజలింగం, కవిత, స్వరూప వినతిపత్రాలను అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిదులు, ప్రజలు మంత్రికి వివిధ సమస్యలను వివరించారు. ముదిరాజ్‌ మహాసభ ఆధ్వ ర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే తెలంగాణ ఉద్యమ అమరుడు పోలీస్‌ కిష్టయ్య సంస్మరణ సభ పోస్టర్‌ను మం త్రి కేటీఆర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ము దిరాజ్‌ సంఘం నాయకులు పర్శ హన్మాండ్లు, కోడి అం తయ్య, ఆవిష్కరించారు. మండలాల్లో సెస్‌ ఎన్నికల అశావ హులు మంత్రిని కలిసి మద్దతు కూడ గట్టుకునే ప్రయత్నం చేశారు. సెస్‌ ఎన్నికలపై ప్రజా ప్రతినిఽధులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో చర్చిస్తారని భావిం చినా చర్చించకుండానే వెళ్లిపోవడంతో ఆశావహులు నిరాశపడ్డారు.

Updated Date - 2022-11-30T00:27:42+05:30 IST

Read more