వనమా రాఘవకు బెయిల్‌ నిరాకరణ

ABN , First Publish Date - 2022-01-23T08:52:02+05:30 IST

రాష్ట్రంలో సంచలనం రేపిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు కొత్తగూడెం కోర్టు బెయిల్‌ నిరాకరించింది.

వనమా రాఘవకు బెయిల్‌ నిరాకరణ

ఫిబ్రవరి 4 వరకు రిమాండ్‌ పొడిగింపు 

కొత్తగూడెం లీగల్‌, జనవరి 22: రాష్ట్రంలో సంచలనం రేపిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు కొత్తగూడెం కోర్టు బెయిల్‌ నిరాకరించింది. అంతేకాక ఫిబ్రవరి 4వరకు రిమాండ్‌ పొడిగించింది. నిజానికి, రిమాండ్‌ శనివారంతో ముగియడంతో జైలు అధికారులు రాఘవను వర్చువల్‌గా కొత్తగూడెం కోర్టులో హాజరుపర్చారు. అయితే, వాదనలు విన్న అదనపు జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎం నీలిమ.. రాఘవకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ కేసులో ఏ-3, ఏ-4లు ఉన్న మండిగ నాగరామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి కొమ్మిశెట్టి లోప మాదవీ బెయిల్‌ పిటీషన్లను కోర్టు శుక్రవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. 

Read more