ఇస్మాయిల్‌పై జిలానీ కాల్పులు జరిపారు: DCP

ABN , First Publish Date - 2022-08-01T15:40:03+05:30 IST

ఇస్మాయిల్‌పై జిలానీ కాల్పులు జరిపాడని డీసీపీ సందీప్‌రావు(DCP Sandeeprao) వెల్లడించారు.

ఇస్మాయిల్‌పై జిలానీ కాల్పులు జరిపారు: DCP

Hyderabad : ఇస్మాయిల్‌పై జిలానీ కాల్పులు జరిపాడని డీసీపీ సందీప్‌రావు(DCP Sandeeprao) వెల్లడించారు. మాదాపూర్ కాల్పుల ఘటనపై డీసీపీ మీడియా సమావేశం(Media meeting)లో మాట్లాడుతూ.. ఇస్మాయిల్‌తో ముజాహిద్దీన్‌ మాట్లాడుతుండగా కాల్పులు జరిపారు. ఇస్మాయిల్‌, ముజాహిద్దీన్‌ మధ్య ల్యాండ్‌ వివాదం ఉందన్నారు. ఇంకా డీసీపీ మాట్లాడుతూ.. ‘‘కంట్రీమేడ్‌ వెపన్‌(Country made weapon)తో కాల్పులు జరిపారు. సంగారెడ్డి(Sangareddy)లో ఇస్మాయిల్‌, ముజాహిద్దీన్‌ కలిసి రియల్‌ ఎస్టేట్‌(Real Estate) చేస్తున్నారు. జిలానీ మొదట ఫైరింగ్‌ చేశాడు. జిలానీపై గతంలో కేసులు ఉన్నాయి. ఇస్మాయిల్‌ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు.

Read more