అబ్బురపరిచే దశావతార ఘట్టాలు

ABN , First Publish Date - 2022-11-30T00:12:22+05:30 IST

నృసింహ క్షేత్రంలో అణువణువూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వైటీడీఏ చర్యలు తీసుకుంటోంది. ఎటుచూసినా పచ్చదనంతోపాటు భక్తిభావం పెం పొందించేలా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో శ్రీమన్నారాయణుడి దశావతార, నారసింహావతార ఘట్టాల చిత్రపటాలను వైటీడీఏ అధికారులు పొందుపరిచారు.

అబ్బురపరిచే దశావతార ఘట్టాలు

యాదగిరిగుట్ట: నృసింహ క్షేత్రంలో అణువణువూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వైటీడీఏ చర్యలు తీసుకుంటోంది. ఎటుచూసినా పచ్చదనంతోపాటు భక్తిభావం పెం పొందించేలా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో శ్రీమన్నారాయణుడి దశావతార, నారసింహావతార ఘట్టాల చిత్రపటాలను వైటీడీఏ అధికారులు పొందుపరిచారు. కొండపైన ప్రతీ నిర్మాణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అష్టభుజి ప్రాకార దక్షిణదిశలో శ్రీమన్నారాయణుడి అవతార ఘట్టాల పెయింటింగ్‌ చిత్రాలను అమర్చా రు.ఆలయ అష్టభుజి ఉత్తర ప్రాకార మండపంలో నారసింహుడి అవతార ఘట్టాల చిత్రాలను అమర్చారు. కొండపైన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రహరీపై ఎలిఫెంట్‌ ప్యానెల్‌ పనులు కొనసాగుతున్నాయి.

Updated Date - 2022-11-30T00:12:22+05:30 IST

Read more