కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కన్వీనర్‌గా దామోదర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-17T10:49:40+05:30 IST

మునుగోడు ఎన్నిక వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌గా టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ నియమించారు.

కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కన్వీనర్‌గా దామోదర్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఎన్నిక వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌గా టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ నియమించారు. వాస్తవానికి గత నెలలోనే ఈ కమిటీ కన్వీనర్‌గా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ను నియమించారు. రాష్ట్ర కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మధుయాష్కీగౌడ్‌ను ఒక నియోజకవర్గానికి పరిమితం చేయడం సరికాదన్న అభిప్రాయం రావడంతో ఈ మార్పు చేశారు.

Read more