భూవివాదంలో మరోసారి కోర్టుకు దగ్గుబాటి రానా

ABN , First Publish Date - 2022-07-15T13:25:50+05:30 IST

భూవివాదానికి సంబంధించి సినీ నటుడు దగ్గుబాటి రానా గురువారం సిటీ సివిల్‌ కోర్టుకు మరోసారి హాజరయ్యారు. ఫిలింనగర్‌లోని

భూవివాదంలో మరోసారి కోర్టుకు దగ్గుబాటి రానా

హైదరాబాద్‌: భూవివాదానికి సంబంధించి సినీ నటుడు దగ్గుబాటి రానా గురువారం సిటీ సివిల్‌ కోర్టుకు మరోసారి హాజరయ్యారు. ఫిలింనగర్‌లోని తమ స్థలం నుంచి ప్రతివాదులైన పి.ప్రమోదమార్‌ను ఖాళీ చేయించేలా (ఎవిక్షన్‌ ఆర్డర్‌) ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని రానా తండ్రి నిర్మాత సురేష్‌ బాబు కోరిన విషయం తెలిసిందే. విచారణ కోసం కోర్టుకు వచ్చిన రానా, తన తరఫు అభ్యంతరాలను కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు  విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

Read more