చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం: నిరంజన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2022-09-24T08:22:58+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకొని రైతులు పంటలు సాగుచేయాల్సిన అవసరం ఉన్నదని...

చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం: నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకొని రైతులు పంటలు సాగుచేయాల్సిన అవసరం ఉన్నదని, ముఖ్యంగా చిరు ధాన్యాల సాగుకు రైతులు ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. చిరుధాన్యాల వాడకంతో పోషకాహార లోపాల సమస్యను అధిగమించవచ్చని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో తెలంగాణ ప్రాంతం చిరు ధాన్యాలకు ప్రసిద్ధిగా ఉండేదని, కాలక్రమంలో సాగు విస్తీర్ణం తగ్గిందని, మళ్లీ చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-24T08:22:58+05:30 IST