సీఎంఆర్‌ ఇవ్వకుంటే మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు!

ABN , First Publish Date - 2022-05-24T09:33:33+05:30 IST

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) నిర్ణీత గడువులోగా ఇవ్వని రైస్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామ ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

సీఎంఆర్‌ ఇవ్వకుంటే మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు!

అడిషనల్‌ కలెక్టర్లకు రాష్ట్ర పౌరసరఫరాలసంస్థ లేఖ

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) నిర్ణీత గడువులోగా ఇవ్వని రైస్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామ ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 2020- 21 వానాకాలం సీజన్‌లో 12 వేల టన్నులు, అదే ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించి 5.39 లక్షల టన్నుల బియ్యం బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే ఇచ్చేలా మిల్లర్లపై ఒత్తిడి తేవాలని ఎఫ్‌సీఐ హైదరాబాద్‌ రీజియన్‌ జీఎం దీపక్‌శర్మ సోమవారం పౌరసరఫరాల సంస్థకు లేఖ రాశారు. దీనిపై పౌరసరఫరాల సంస్థలో సమీక్ష నిర్వహించారు. అనంతరం అనంతరం అన్ని జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లకు కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ లేఖ రాశారు. మిల్లింగ్‌ను వేగవంతం చేయించాలని, నిర్ణీత వ్యవధిలో సీఎంఆర్‌ డెలివరీ ఇవ్వని రైస్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సూచించారు. 

Read more