కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఓయూలో క్రికెట్ టోర్నమెంట్..

ABN , First Publish Date - 2022-01-28T17:13:46+05:30 IST

ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు.

కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఓయూలో క్రికెట్ టోర్నమెంట్..

హైదరాబాద్ : ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నేడు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు టోర్నమెంట్‌ను ప్రారంభించనున్నారు. అడ్డుకునేందుకు విద్యార్థి నేతలు సమాయత్తమవుతున్నారు. ఓయూలో వేసిన టీఆర్‌ఎస్‌ ప్రతినిధుల ఫ్లెక్సీలను విద్యార్థులు చించేశారు. ఫ్లెక్సీలను తగలబెట్టి విద్యార్థి నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన తర్వాతనే ఓయూలో అడుగుపెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఓయూలో అడుగుపెడితే అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. 


Read more